తెలంగాణలోనాటి నిజాంల విశ్రాంతి భవనమే రాష్ర్టపతి నిలయం

తెలంగాణలోనాటి నిజాంల విశ్రాంతి భవనమే రాష్ర్టపతి నిలయం
x
Highlights

తెలంగాణలోనాటి నిజాంల విశ్రాంతి భవనమే రాష్ర్టపతి నిలయం. భారత రాష్ర్టపతి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విడిది చేసే ఈ భవనం 158 వసంతాలు పూర్తి చేసుకుంది....

తెలంగాణలోనాటి నిజాంల విశ్రాంతి భవనమే రాష్ర్టపతి నిలయం. భారత రాష్ర్టపతి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విడిది చేసే ఈ భవనం 158 వసంతాలు పూర్తి చేసుకుంది. బ్రిటీష్ వారి పాలనలో అప్పటి వైస్రాయ్ నివాసంగా ఈ భవనం నిర్మించారు. ఇప్పుడు ఈ భవనం ప్రకృతికి నిలయంగా మారింది. పచ్చని పరిసరాలు ఔషద, పూల మొక్కలతో స్వచ్చమైన గాలి, అహ్లాదకర వాతావరణంతో ఆలరారుతోంది.

భారత రాష్ర్టపతికి దేశం మొత్తంలో మూడు భవనాలు ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ తో ఈశాన్య రాష్ర్టాల్లో ఒకటి, దక్షిణాధి రాష్ర్టల్లో ఒక విడిది భవనాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాష్ర్టపతి నిలయం 158 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ భవనానికి ఎంతో చరిత్ర ఉంది. సికింద్రాబాద్ సమీపంలోని బొల్లారంలో ఆసిఫ్ జాహీ వంశీయుల నాలుగో పాలకుడు నిజాం నజీర్-ఉద్-దౌల ఈ భవన నిర్మాణానికి 1856లో శంఖుస్థాపన చేశారు. 1857లో అతను మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఐదవ నిజాం అప్జల్-ఉద్-దౌల 1860లో భవనం పూర్తి చేయించాడు.

బ్రిటీష్ వారి పాలనలో అప్పటి వైస్రాయ్ నివాసంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత నిజాం ప్రభువులు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్యానంతరం 1950లో కేంద్ర ప్రభుత్వం 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి దక్షిణాదిలో రాష్ర్టపతి నిలయంగా తీర్చిదిద్దారు. 90 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ర్టపతి నిలయం ఆనాటి రాచరికపు తీపిగుర్తుగా నిలుస్తోంది.

రాష్ట్రపతి నిలయం నిర్మాణ శైలి రాచఠీవీతో చూపరులను ఆకట్టుకునే రీతిలో ఉంది. భవన ప్రాంగణంలో అడుగు పెట్టగానే రకరకాల ఔషద మొక్కలు, పూల తోటలు పెద్దపెద్ద వృక్షాలతో స్వచ్చమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆలరారుతోంది. 20 గదులకు పైగా ఉన్న భవనంలో అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. వేర్వేరుగా ఉన్న వీటిని కలుపుతూ అండర్ గ్రౌంట్ టన్నెల్ ఉంది. భవన నిర్మాణం అంతా యురోపియన్ శైలిలో నిర్మించబడింది. రాష్ర్టపతితో పాటు ఆయన కుటుంబీకులు ఉండేందుకు, భద్రతా సిబ్బంది, ప్రెసిడెంట్ వింగ్ లో సినిమాహాల్, దర్బార్ హాల్, 25 మంది ఒకే సారి భోజనం చేసే విధంగా భోజన శాల వంటి వసతులు ఉన్నాయి. ప్రతి ఏటా కొన్ని రోజుల పాటు రాష్ర్టపతి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు వారం నుండి పదిహేను రోజులు ఈ భవనంలో బస చేస్తుంటారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ర్టపతిని కలుస్తుంటారు.

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ వారు రాష్ట్రపతి నిలయం నిర్వాహణ బాధ్యతలు చూస్తుంటారు. రాష్ర్టపతి ఇక్కడ బస చేయని రోజుల్లో గట్టి పోలీస్ భద్రత ఉంటుంది. ఎవరినీ లోనికి అనుమతించరు. రాష్ర్టపతి పర్యటన సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వ శాఖల అధికారులు, సంబంధిత సిబ్బందితో సందడిగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories