'మహర్షి' విషయంలో అలా ఎందుకు జరిగింది

మహర్షి విషయంలో అలా ఎందుకు జరిగింది
x
Highlights

గత కొన్ని రోజులుగా 'మహర్షి' సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు విపరీతంగా ఖర్చు చేయించాడని బడ్జెట్ అనుకున్నదానికంటే బాగా...

గత కొన్ని రోజులుగా 'మహర్షి' సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు విపరీతంగా ఖర్చు చేయించాడని బడ్జెట్ అనుకున్నదానికంటే బాగా పెరిగిపోవడంతో బిజినెస్ ఎక్కువగా జరిగినప్పటికీ ప్రాఫిట్ లు మాత్రం తక్కువ గానే వచ్చాయని టాక్ నడుస్తోంది. ఈ విషయమై మహేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చాడు. సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిందని ఆ మేరకు వసూళ్లు వస్తాయో లేదో అని టెన్షన్ గా కూడా ఉందని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. నిజానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'ఊపిరి' సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ పివిపి నిర్మించిన ఈ సినిమా వసూళ్ళ పరంగా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.

కానీ 'మహర్షి' సినిమాని నిర్మించిన ముగ్గురు నిర్మాతలు అయిన దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పీవీపీ లలో కీలకపాత్ర దిల్ రాజు ది అని ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. సినిమాకి సంబంధించిన వ్యవహారాలన్నీ రాజు గారు దగ్గరుండి చూసుకున్నారని ట్రాక్. ఇక ప్రొడక్షన్ విషయంలో ఆయన ఎంత పక్కాగా ఉంటారని అందరికీ తెలిసిందే. మహా అయితే బడ్జెట్ కొంచెం అటు ఇటు అయినప్పటికీ ఎంత స్టార్ హీరో సినిమా అయినా దిల్ రాజు ఎప్పుడు హద్దులు దాటి పోలేదు. పైగా దిల్ రాజు వంశీ పైడిపల్లి కి కూడా బాగా దగ్గరైన వ్యక్తి. ఎంత సూపర్ స్టార్ తో సినిమా అయినప్పటికీ దిల్ రాజు అలా మితిమీరి బడ్జెట్ ఎలా పెట్టాడు అని అందరూ షాక్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories