గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత

గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత
x
Highlights

గుంటూరు జిల్లాల్లో కొత్త సంవత్సర వేడుకలు గొడవలు, కొట్లాటలతో మొదలయ్యాయి. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో కొత్త సంవత్సర వేడుకల్లో తలెత్తిన వివాదం...

గుంటూరు జిల్లాల్లో కొత్త సంవత్సర వేడుకలు గొడవలు, కొట్లాటలతో మొదలయ్యాయి. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో కొత్త సంవత్సర వేడుకల్లో తలెత్తిన వివాదం కొట్టుకునేంత వరకు వచ్చింది. ఇరుపక్షాలు రాళ్లు రువ్వుకోవడంతో గ్రామం రణరంగంగా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి తలెత్తిన ఈ ఘర్షణతో సోమవారం మధ్యాహ్నం యువకులు వెళ్తుండగా మరో వర్గానికి చెందిన వారు దాడి చేసి గాయపరిచారు. దీంతో ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్సైలు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గొట్టిపాడులో ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అంతకంతకూ ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. గ్రామంలోకి వచ్చిన పోలీసు బెటాలియన్‌ ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే తమ ఇళ్లలోకి చొరబడిన పోలీసులు దాడి చేయడంపై మరో వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ప్రస్తుతం ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories