జ్యోతిర్లింగాలలో ఆ ఒక్కచోట అమృతం లభిస్తుందట!

జ్యోతిర్లింగాలలో ఆ ఒక్కచోట అమృతం లభిస్తుందట!
x
Highlights

పరమశివజ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగు దిక్కులలో...

పరమశివజ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం), నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి.

ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలొ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు జీవితాలలో ప్రస్ఫుటమవుతాయని భక్తుల నమ్మకం. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంత కోటి పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

1.రామనాధ స్వామి లింగము: రామేశ్వేరము
2.మల్లికార్జున లింగము: శ్రీశైలము
3.భీమ శంకర లింగము: భీమ శంకరం
4.ఘ్రుష్టీశ్వర లింగము: ఘృష్ణేశ్వరం
5.త్రయంబకేశ్వర లింగము: త్రయంబకేశ్వరం
6.సోమనధ లింగము: సోమనాధ్
7.నాగేశ్వర లింగము: దారుకావనం (ద్వారక)
8.ఓంకారేశ్వర-అమలేశ్వర లింగము: ఓంకారక్షేత్రం
9.మహాకాళ లింగం: ఉజ్జయిని
10.వైద్యనాధ లింగము: చితా భూమి (దేవఘర్)
11.విశ్వేశ్వర లింగము: వారణాశి
12.కేదారేశ్వర లింగము: కేదరనాథ్

సోమనాథ జ్యోతిర్లింగం: సోమనాథుడు
విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, (గుజరాత్). దీనిని ప్రభాస క్షేత్రము అంటారు. చంద్రునిచే ఈ లింగము ప్రతిష్టింపబడినదని స్థలపురాణము.

మల్లికార్జునుడు
శ్రీశైలము, కర్నూలు జిల్లా, (ఆంధ్రప్రదేశ్). ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా ప్రవహిస్తుంది. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి.

మహాకాళుడు
(అవంతి) ఉజ్జయిని, (మధ్యప్రదేశ్). క్షిప్రానది ఒడ్డున ఈ పుణ్య క్షేత్రం కలదు. ఈ నగరములో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరములు, జలకుండము ఉన్నవి.

ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు
మామలేశ్వరము, (మధ్య ప్రదేశ్). నర్మద (రేవా) నదీ తీరమున ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఒకే లింగము రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతోంది. అమ్మవారు అన్నపూర్ణ.

వైద్యనాథుడు(అమృతేశ్వరుడు)
పర్లి (కాంతిపూర్), దేవొగడ్ (బీహార్). బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపములో నున్నది. సహ్యాద్రి కొండల అంచునున్నది. అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచారని, స్పృశించిన భక్తులకు అమృతము లభిస్తుందని నమ్మకము.

భీమశంకరుడు
డాకిని, భువనగిరి జిల్లా, పూనె వద్ద, (మహారాష్ట్ర). చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతముల వద్ద ఈ ఆలయం ఉంది. త్రిపురాపుర సంహారానంతరము మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా ఉన్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండము ఉన్నవి.

రామేశ్వరుడు
రామేశ్వరము(తమిళనాడు). శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలము. కాశీ గంగా జలమును రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడి అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.

నాగేశ్వరుడు (నాగనాథుడు)
(దారుకావనము), ద్వారక వద్ద(మహారాష్ట్ర) ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు.

విశ్వనాథుడు
వారణాసి(ఉత్తరప్రదేశ్) కాశి అని కూడా పిలుస్తారు. వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానము. పరమపావన తీర్థము. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.

త్రయంబకేశ్వర ఆలయం
త్రయంబకేశ్వరుడు, నాసిక్ (మహారాష్ట్ర) గౌతమీ తీరమున ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడి లింగము చిన్న గుంటవలె కనిపిస్తుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరము కూడ ఉన్నది. కుశావర్త తీర్థము, గంగాద్వార తీర్థము, వరాహ తీర్థము ముఖ్యమైనవి. 12 సంవత్సరములకొకసారి జరిగే సింహస్థపర్వము పెద్ద పండుగ.

కేదారేశ్వరుడు
హిమాలయాల్లో, గర్‌వాల్ జిల్లా(ఉత్తరప్రదేశ్)
మందాకినీ నదీ సమీపంలో మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.

ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు)
వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర (దేవగిరిలోనిదే జ్యోతిర్లింగమని కూడ చెబుతుంటారు)

Show Full Article
Print Article
Next Story
More Stories