11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు

Submitted by arun on Tue, 03/13/2018 - 10:49
congress mlas

తెలంగాణ శాషన సభలో నిన్న జరిగిన దాడి ఘటనపై స్సీకర్ మధుసూదనాచారి కఠిన చర్యలు తీసుకున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ శాసనసభ నుంచి పూర్తిగా బహిష్కరించారు. అంతేకాదు నిన్నటి ఘటనకు సంబంధించి 11మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఈ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. సస్పెండయిన వారిలో సీఎల్పీనేత జానారెడ్డి , ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి
,  చిన్నారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, పద్మావతి, వంశీచంద్‌, రామ్మోహన్‌రెడ్డి, మాధవ్‌ ఉన్నారు. 

శాసన సభ ప్రారంభం కాగానే స్సీకర్ మధుసూదనాచారి నిన్నటి ఘటనను తీవ్రంగా ఖండించారు. చట్ట సభలో జరిగిన దాడి తీవ్ర విషయమన్నారు. ఇది క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. దాడికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. తర్వాత మంత్రి హరీష్ రావ్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌ను శాసన సభ నుంచి బహిష్కారించాలని, 11 మంది కాంగ్రెస్ సభ్యులను బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. హరీష్ ప్రవేశ పెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. వెంటనే సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని సభనుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. 

English Title
11 Congress Leaders Suspended

MORE FROM AUTHOR

RELATED ARTICLES