కారు స్పీడ్ కు రోడ్ రోలర్ బ్రేక్

కారు స్పీడ్ కు రోడ్ రోలర్ బ్రేక్
x
Highlights

స్పీడ్‌గా వెళ్తున్న కారుకు రోడ్డు రోలర్ అడ్డొచ్చింది. అంతే ఆ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఘటన జరిగింది. ఇదేంటి క్రైం...

స్పీడ్‌గా వెళ్తున్న కారుకు రోడ్డు రోలర్ అడ్డొచ్చింది. అంతే ఆ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఘటన జరిగింది. ఇదేంటి క్రైం న్యూస్‌లా ఉందని అనుకుంటున్నారా..? ఇది పక్కా పొలిటికల్ న్యూస్. దీని సంగతేంటో మీరే చూడండి.

దూసుకుపోతున్న కారుకు రోడ్డు రోలర్ అడ్డొస్తే ఏం జరుగుతుంది...? కారు తుక్కుతుక్కు అవుతుంది. భువనగిరి లోక్‌సభలో ఇదే జరిగింది. అయితే ఇక్కడ ఉన్నవి నిజమైన వాహనాలు కావు. ఎన్నికల్లో పార్టీలకు కేటాయించిన గుర్తులు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు ట్రక్కు అడ్డొస్తే ఇప్పుడు రోడ్డు రోలర్ అడ్డుపడింది. దీంతో భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి నర్సయ్య గౌడ్ పరాజయం పాలైయ్యారని అభిప్రాయపడుతున్నారు. భువనగిరి స్థానంలో స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 13 మంది పోటీ చేశారు. ఇక్కడ 12,12,631 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి 5,32,795 ఓట్లు, నర్సయ్య గౌడ్‌కు 5,27,576 ఓట్లు వచ్చాయి. కేవలం 5,219 ఓట్ల తేడాతో నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు.

భువనగిరిలో రోడ్డురోలర్ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సింగపాక లింగంకు 27,973 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్‌ యూనిట్‌పై కారు గుర్తు పైనుంచి మూడో సంఖ్యలో ఉండగా రోడ్డురోలరు గుర్తు కింద నుంచి మూడోదిగా ఉంది. రెండు గుర్తులు ఒకేలా కనిపించడంతో కొందరు కారు అనుకుని రోడ్డురోలర్‌ గుర్తుకు ఓటు వేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ట్రక్కు గుర్తు కారును దెబ్బతీసిందో ఇప్పుడు రోడ్డురోలర్‌ కూడా అలానే నష్టం కలిగించిందని భావిస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.





Show Full Article
Print Article
Next Story
More Stories