బాప్‌రే అనిపించిన బామ్మ స్కైడైవింగ్...102 ఏళ్లలో అదిరిపోయే ఫీట్స్‌ చేసిన అవ్వ

x
Highlights

స్కైడైవింగ్ చేయాలంటే గుండె ధైర్యం చాలా ఉండాలి. వేల అడుగల ఎత్తు నుంచి కిందకు దూకడమంటే మామూలు విషయం కాదు. యువకులే చాలామంది ఈ సాహసం చేయాలంటే...

స్కైడైవింగ్ చేయాలంటే గుండె ధైర్యం చాలా ఉండాలి. వేల అడుగల ఎత్తు నుంచి కిందకు దూకడమంటే మామూలు విషయం కాదు. యువకులే చాలామంది ఈ సాహసం చేయాలంటే భయపడిపోతుంటారు. మరి వయసు మీద పడినవారు ఈ సాహసం చేయాలంటే అసలు వారిని ఊహించుకోవడమే కష్టం. కానీ 102 సంవత్సరాల వయస్సులో ఓ బామ్మ చేసిన సాహసం చూసి బాప్‌రే అనడం ఖాయం.

ఇక్కడ కనిపిస్తున్న బామ్మకు వందేళ్ళు దాటేసింది. ఈ ముసలి వయస్సులో ముక్కు మూసుకుని ఇంట్లో రామా, కృష్ణా అంటూ కూచోలేదు ఆ అవ్వ. తన వయసుకు మించి ఓ సాహస కార్యం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమ్మో అనిపించింది. ఇంతకీ ఈ అవ్వ వయస్సు మరెంతో కాదు జస్ట్ 102 ఏళ్ళు మాత్రమే. పేరు ఇరెన్ ఓషియా దక్షిణ ఆస్ట్రేలియాలో ఉంటోంది. ఆస్టేలియాలోని లాంగ్‌హార్న్‌క్రీక్ డ్రాప్ జోన్ దగ్గర ఇటీవల 14 వేల అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి లేట్‌వయసులో కూడా వావ్‌ అనిపించింది. వృద్ధాప్యంలోనూ ఈ బామ్మ చేసిన సాహసం వైరల్‌గా మారడమే కాక గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది.

ప్రపంచంలో ఈ ఫీట్ చేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు కొట్టేసింది. ట్రైనర్ జెడ్ స్మిత్‌తో కలిసి ఇరెన్ గాల్లో విహరించిన వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతోంది. ముచ్చటగా మూడోసారి స్కైడైవింగ్ చేసి ఔరా అనిపించారు. ఈ బామ్మ ఎందుకీ సాహసానికి పూనుకొందంటే మోటార్ న్యూరాన్ అనే విచిత్రమైన వ్యాధికి గురైన వారి చికిత్స కోసం విరాళాలు సేకరించడానికట. గతంలో ఈ వ్యాధికి గురై ఈమె కూతురు మరణించింది. దీంతో తన కూతురులా మరొకరు మృత్యువాత పడకుండా ఈ సాహసానికి పూనుకుందట ఈ బామ్మ. అలా వచ్చిన ఆదాయాన్ని ఈ వ్యాధిగ్రస్తుల చికిత్సకే కాక..వారి హాస్పిటల్ ఖర్చుల కోసం కూడా వినియోగిస్తారట. మీరు చాలా గ్రేట్ అని స్థానికులు పొగిడినప్పుడు..ఈ అవ్వ ముసిముసి నవ్వులు నవ్వుతూ..తాను చాలా సాధారణ వ్యక్తినని తన నిరాడంబరత్వాన్ని చాటుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories