ప్రతిపక్ష హోదా కోల్పోనున్న కాంగ్రెస్...టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం కానున్న సీఎల్పీ?

ప్రతిపక్ష హోదా కోల్పోనున్న కాంగ్రెస్...టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం కానున్న సీఎల్పీ?
x
Highlights

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి....

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 13 మంది చేరికతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోనుంది. పక్కా ప్లాన్‌తో గులాబీ బాస్ ముందుకెళుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మరోషాక్ ఇవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ ఎన్నికల్లో 19స్థానాలు గెలిచింది. ఇప్పటికే 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.

తాజాగా మరో ముగ్గురు శాసన సభ్యుల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికకు గులాబీ బాస్ ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 24 లోపు వీరు కారెక్కుతారంటున్నారు.

వారంతా టీఆర్ఎస్‌‌లో చేరాక వారు కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని స్పీకర్‌కు లేఖ రాయనున్నారు. గతంలో టీడీపీ శాసనసభా పక్షం, కాంగ్రెస్ శాసన మండలి పక్షం ఇలాగే విలీనం అయ్యాయి. ఇదే వ్యూహంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అసమ్మతి వర్గం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

విలీనం జరిగితే కాంగ్రెస్ పార్టీ శాసనసభలో విపక్ష హోదాను కోల్పోతుంది. సభలో మొత్తం బలంలో పదోవంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120మంది సభ్యులు గల శాసనసభలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు 91మంది సభ్యులుండగా కాంగ్రెస్ నుంచి 13 మంది, టీడీపీ నుంచి ఒకరు చేరితే టీఆర్ఎస్‌ బలం 105కు చేరుతుంది.

కాంగ్రెస్‌లో చివరకు ఏడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. వచ్చే జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆలోపు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి తమకు అనుకూలంగా పరిస్థితులు చక్క బెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories