చిరు కోసం టీడీపీ, వైసీపీ గాలం?

చిరు కోసం టీడీపీ, వైసీపీ గాలం?
x
Highlights

చిరంజీవికి తమ పార్టీ కండువా కప్పాలని ఏపీలోని అధికారప్రతిపక్ష పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయని తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది. చిరంజీవిని తమ పార్టీలో...

చిరంజీవికి తమ పార్టీ కండువా కప్పాలని ఏపీలోని అధికారప్రతిపక్ష పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయని తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది. చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకుంటే.. ఆ సామాజిక వర్గం తమ వైపు మొగ్గు చూపుతుందని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. పైగా పవన్‌ వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడంతో చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకుంటే తమ్ముడికి అన్న ద్వారా చెక్ పెట్టొచ్చని టీడీపీ, వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని టీడీపీలో చేర్చుకునేందుకు మంత్రులు గంటా, కామినేని రంగంలోకి దిగారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చిరుకు అత్యంత ఆప్తులు. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు. ఈ ఇద్దరూ తల్చుకుంటే చిరంజీవికి పసుపు కండువా కప్పడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కన్నబాబు కూడా చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవిని పార్టీలో చేర్చుకుంటే మేలు జరుగుతుందని కన్నబాబు జగన్‌కు సూచించినట్లు టాక్. జగన్ మాత్రం ముందు చిరు వైఖరేంటో తెలుసుకోవాలని, ఆ తర్వాత పార్టీలోకి ఆహ్వానిద్దామని కన్నబాబుతో అన్నారట.

ఇదిలా ఉంటే, 2018 మార్చిలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవ్వాల్సి ఉంది. దీంతో చిరుకు రాజ్యసభ సీటును టీడీపీ ఆఫర్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆ పార్టీ తరపున మళ్లీ రాజ్యసభ ఎంపీ అయ్యే అవకాశం చిరంజీవికి లేదు. కనుక ఏదో ఒక పార్టీలో చిరు చేరతారా.. లేక రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా అన్న చర్చ కూడా నడుస్తోంది. చిరంజీవి తమ్ముడు పవన్ అన్నతో విభేదించి పార్టీ పెట్టుకున్నారు. తనతో విభేదించిన తమ్ముడి పార్టీలో చిరు చేరే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. మొత్తం మీద చిరంజీవి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ, వైసీపీ కసరత్తు ప్రారంభించినట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories