Jio Drive-in Theater: త్వ‌ర‌లో కారులో కూర్చొని థియేట‌ర్‌లో సినిమా చూడ‌వ‌చ్చు..!

Reliance is all set to Launch an Open Theater in Mumbai Called Geo Drive-in Theater
x

మొట్టమొదటి జీయో డ్రైవ్ ఇన్ థియేటర్ ముంబైలో (ఫైల్ ఇమేజ్)

Highlights

Jio Drive-in Theater: కొవిడ్ వ‌ల్ల సినిమా ప్ర‌పంచం విల‌విల‌లాడుతుంది. థియేట‌ర్లు స‌రిగ్గా తెరుచుకోక ఆర్థికంగా చితికిపోయింది

Jio Drive in Theater: కొవిడ్ వ‌ల్ల సినిమా ప్ర‌పంచం విల‌విల‌లాడుతుంది. థియేట‌ర్లు స‌రిగ్గా తెరుచుకోక ఆర్థికంగా చితికిపోయి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వాలు కొంచెం వెసులుబాటు క‌ల్పించినా పూర్తి స్థాయిలో మాత్రం తెర‌చుకోవ‌డం లేదు. దీంతో వీటినే న‌మ్ముకొని ఉన్న కార్మికుల బ‌తుకులు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. దీనికి తోడు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ పాంలు రావ‌డంతో థియేట‌ర్ల‌లో సినిమాలు విడుద‌ల‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. ఇటువంటి స‌మ‌యంలో రిల‌య‌న్స్ కంపెనీ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఓ శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లో ఓపెన్ థియేటర్‌లు ప్రారంభించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొద‌ట‌గా ముంబైలో ఈ సినిమా థియేట‌ర్‌ని ప్రారంభించ‌నున్న‌ట్లుల తెలిపింది.

ఈ థియేటర్ బహిరంగ ప్రదేశంలో చాలా విస్తీర్ణంలో ఉంటుంది. ఇలాంటి థియేట‌ర్లు ఎక్కువ‌గా మ‌నం విదేశాలలో చూడ‌వ‌చ్చు. మనుషులు ఒకరికొకరు దూరంగా ఉంటారు. దీనివల్ల వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రజలు తమ కారులో లేదా పెద్ద సినిమా స్క్రీన్ ముందు ఎక్క‌డైనా కూర్చుని సినిమాని ఆస్వాదించవచ్చు. రిలయన్స్ ఇప్పుడు ఇలాంటి కొన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను నిర్మించబోతోంది. వీటికి జియో డ్రైవ్-ఇన్ థియేటర్ అని పేరు పెట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఇలాంటి థియేట‌ర్లు ఉంటే ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటిస్తూ సినిమాని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ఇలాంటి థియేటర్లకు పెద్ద ఔట్ డోర్ స్క్రీన్ ఉంటుంది. అందులో తమ సౌలభ్యం ప్రకారం కారులో ఉండి సినిమాని వీక్షించవచ్చు. వాయిస్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. లేదా బాహ్య స్పీకర్లు ఇన్‌స్టాల్ చేస్తారు. ప్రపంచంలో ఇప్పటికే ఇటువంటి ప్రయోగాలు జరిగాయి కానీ దాని వ్యాపారం అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పుడు కొవిడ్‌ వల్ల ఈ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తోంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ కొవిడ్‌కి భ‌య‌ప‌డి జ‌నాలు థియేట‌ర్ల‌లోకి రావ‌డం లేదు. ఇలాంటివి ఏర్పాటు చేస్తే మ‌ళ్లీ సినిమా ప్ర‌పంచం క‌ళ‌క‌ళలాడుతుంద‌ని కొంద‌రు న‌మ్ముతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories