మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు

మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
x
Highlights

వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గ్యాస్ గుదిబండలా మారుతోంది. ఓ వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్నాయి....

వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గ్యాస్ గుదిబండలా మారుతోంది. ఓ వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్నాయి. మరోవైపు వంటిల్లు గ్యాస్ బండ మోత మోగిస్తోంది. సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.

డిసెంబర్ 2న ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలను చమురు సంస్థలు పెంచాయి. అవి సరిపోనట్టు మళ్లీ ఇప్పుడు మరో 50 పెంచుతూ మరో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ ఉత్తర్వులో పేర్కొంది.

వినియోగదారులకు రాయితీగా అందించే ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలను చూస్తే దేశ రాజధానిలో ప్రస్తుతం 644 రూపాయలుగా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర 694కు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లోనూ గ్యాస్ ధర మోత మోగనుంది. ఇక 5 కేజీల సిలిండర్ పై 18, 19 కేజీల సిలిండర్ పై 36.50 పెంచినట్టు ఆయిల్ సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories