ఆ కంపెనీ ఉద్యోగులకి గుడ్‌న్యూస్‌.. వారానికి 3 రోజులు ఆఫీస్‌.. జీతాలలో పెరుగుదల..!

Good News for TCS Company Employees Office 3 Days a Week Salary Increase | Live News
x

ఆ కంపెనీ ఉద్యోగులకి గుడ్‌న్యూస్‌.. వారానికి 3 రోజులు ఆఫీస్‌.. జీతాలలో పెరుగుదల..!

Highlights

TCS Company: కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సిస్టమ్‌ ప్రారంభమైంది...

TCS Company: కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సిస్టమ్‌ ప్రారంభమైంది. కానీ పరిస్థితి మెరుగుపడడంతో ఇప్పుడు చాలా కంపెనీలు తమఉద్యోగులను కార్యాలయానికి పిలవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) కూడా తన ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించుకోవడం ప్రారంభించింది. ఈ మేరకు కంపెనీ ఉత్తర్వులు జారీ చేసింది.

సీనియర్లు మాత్రమే ఆఫీసుకు

ప్రస్తుతం ఉద్యోగులందరు కార్యాలయానికి వెళ్లరు. ప్రస్తుతం కంపెనీలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు అంటే 50 వేల మంది మాత్రమే కార్యాలయానికి వెళుతారు. ఈ ఉద్యోగులు వారానికి 3 రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లాలి. మిగిలిన రెండు రోజులు ఇంటి నుంచి పని చేయవలసి ఉంటుంది. TCS CEO, MD రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ.. "ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ నుంచి కంపెనీ సీనియర్ అసోసియేట్‌లు కార్యాలయానికి రావడం ప్రారంభిస్తారు. కార్యాలయానికి పిలిచే ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచుతాం.

ఈ ఏడాది మధ్యలో అంటే జూన్ జూలై నాటికి చాలా మంది ఉద్యోగులు(80 శాతం) ఆఫీసు నుంచే పని చేయడం ప్రారంభిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిసిఎస్ తన ఉద్యోగుల వేతనాన్ని 6 నుంచి 8 శాతం పెంచుతుందని తెలిపారు. గతేడాది కూడా వేతనాలని పెంచిన సంగతి తెలిసిందే.

కొత్త ఉద్యోగుల నియామకం

గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్యను పెంచడం గమనార్హం. 2021 22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ 35,209 కొత్త ఉద్యోగులను నియమించుకుంది. త్రైమాసికంలో ఒక కంపెనీ చేసిన అత్యధిక అపాయింట్‌మెంట్ ఇదే. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,92,195కి చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories