Gold Price: పసిడి ప్రియులకు షాక్.. తారాస్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు

Gold, Silver Price Today, April 16
x

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. తారాస్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు

Highlights

Gold Price: 980 రూపాయల తులం గోల్డ్ ధర.. 1000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర

Gold Price: దేశంలో రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అస్సలు తగ్గేదేలే అనే రీతిగా ప్రతిరోజూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు ఒక తులం గోల్డ్ రేటు రూ. 900 నుంచి రూ. 980 వరకు పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు 22 క్యారెట్ల అయితే రూ.67950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74130 వద్ద ఉన్నాయి. నిన్న రూ. 550 నుంచి రూ. 600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 900, రూ. 980 పెరిగి.. ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 68100 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 74280 రూపాయలకు చేరింది. నిన్న రూ.550, రూ.600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ.900 నుంచి రూ.980 వరకు పెరిగింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 880 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర రూ. 1000 పెరిగి కేజీ రూ. 87000కు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories