JIO: ఇక ప్రతీ నెల మొబైల్ రీఛార్జ్ అవసరం లేదు.. జియో సరికొత్త ఆఫర్..

Can be recharged automatically with jio UPI AUTOPAY feature
x

JIO: ఇక ప్రతీ నెల మొబైల్ రీఛార్జ్ అవసరం లేదు.. జియో సరికొత్త ఆఫర్..

Highlights

JIO: ఇక ప్రతీ నెల మొబైల్ రీఛార్జ్ అవసరం లేదు.. జియో సరికొత్త ఆఫర్..

JIO: ప్రతి నెలా రిఛార్జ్‌ చేయాలంటే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని సంవత్సర ప్లాన్‌ తీసుకుంటే డబ్బులు సమస్యగా ఉంటాయి. అందుకే జియో వీరి బాధని అర్థం చేసుకొని సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీంతో ప్రతి నెలా రిఛార్జ్‌ ఆటోమేటిక్‌గా జరుగుతోంది. మొబైల్‌లో ఒక్కసారి సెట్టింగ్స్‌ చేస్తే చాలు. జియో యూపీఐ ఆటోపే (UPI AUTOPAY) ఫీచర్‌ను తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), జియో కలిసి ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. దీని ద్వారా రీఛార్జ్ ప్రక్రియ చాలా సులభం అవుతుంది. అయితే ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

యూజర్లు మైజియో యాప్‌లో యూపీఐ ఆటోపే ఎనేబుల్ చేసి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రీఛార్జ్ చేయాలనుకున్న ప్లాన్స్‌ను సెలెక్ట్ చేసి ఆటోపే ఫీచర్ ఎనేబుల్ చేస్తే చాలు ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమెటిక్‌గా రీఛార్జ్ అవుతుంది. ఇలా జియో యూజర్లు రూ.5,000 వరకు రీఛార్జ్ చేయొచ్చు. రీఛార్జ్ సక్సెస్ కావడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు రీఛార్జ్‌కు సంబంధించిన వివరాలను కూడా మాడిఫై చేయొచ్చు. జియో యూజర్లు కావాల్సినప్పుడు ఈ-మ్యాండేట్ తొలగించవచ్చు. రీఛార్జ్ చేయాల్సిన తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాలిడిటీ పూర్తవుతుందనే టెన్షన్ ఉండదు.

జియో యూపీఐ ఆటోపే ఫీచర్ వాడుకోవాలంటే ముందుగా రిలయన్స్ జియో యూజర్లు ముందుగా మైజియో యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. తమ జియో నెంబర్‌తో లాగిన్ కావాలి. హోమ్ స్క్రీన్‌లో మొబైల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. రీఛార్జ్ అండ్ పేమెంట్స్ సెక్షన్‌లో జియో ఆటోపే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. జియో ఆటోపే యాక్టివేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. మెనూలో నుంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సెలెక్ట్ చేయాలి. ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. యూపీఐ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ యూపీఐ ఐడీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఆటోపే ఎనేబుల్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories