Alert SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతున్న ధరలు..!

Alert to SBI customers debit card prices are increasing from April 1
x

Alert SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతున్న ధరలు..!

Highlights

Alert SBI Customers: దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి.

Alert SBI Customers: దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతు న్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకునేందుకు గతంలో కంటే రూ.75 అదనం గా చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంపిక చేసిన కొన్ని ఏటీఎమ్‌ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలు మునుపటి కంటే రూ. 75 ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది.

ఈ డెబిట్ కార్డుల ఛార్జీలలో మార్పులు

ఎస్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుంచి క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ ‌లెస్ డెబిట్ కార్డ్‌లతో పాటు యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌లు, మై కార్డ్, ప్లాటినం డెబిట్ కార్డ్, ప్రైడ్ లేదా ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్ వంటి కార్డ్‌ల ధరలు పెంచింది.

ఏ కార్డుకు ఎంత వసూలు చేస్తారంటే..

ఇంతకుముందు, క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ కోసం రూ. 125 + GST వసూలు చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 1, 2024 తర్వాత, అది రూ. 200 + GST అవుతుంది. ఇప్పుడు మీరు యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ వంటి ఇమేజ్ కార్డ్‌ల కోసం రూ. 250 + GST చెల్లించాలి. ఇంతకుముందు ఇది రూ. 175 + జీఎస్టీ మాత్రమే ఉండేది.

అదేవిధంగా ప్లాటినం డెబిట్ కార్డ్ కోసం మీరు ఇంతకు ముందు రూ. 250 + GST చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు రూ. 325 + GST చెల్లించాలి. ఇక నుంచి ప్రైడ్ లేదా ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్ కోసం వార్షిక నిర్వహణ ఛార్జీ రూ. 425 + జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది అంతకుముందు ఇది రూ. 350 + జిఎస్‌టి మాత్రమే ఉండేది.

Show Full Article
Print Article
Next Story
More Stories