PPF, SSY, NPS ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పనిచేయకుంటే జరిమానా తప్పదు..!

Alert to PPF, SSY, NPS Accountants penalty for not Depositing Minimum Balance
x

PPF, SSY, NPS ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పనిచేయకుంటే జరిమానా తప్పదు..!

Highlights

PPF, SSY, NPS: మీరు పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ లాంటి ఖాతాలో ఇన్వెస్ట్‌ చేసేవారైతే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి.

PPF, SSY, NPS: మీరు పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ లాంటి ఖాతాలో ఇన్వెస్ట్‌ చేసేవారైతే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం అవసరం. లేదంటే ఆ ఖాతా ఆగిపోతుంది. అంతేకాదు మళ్లీ యాక్టివ్‌ చేయడానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పీపీఎఫ్‌ రూల్స్ 2019 ప్రకారం.. ప్రతి ఆర్థిక సంవత్సరం పీపీఎఫ్‌ ఖాతాలో కనీసం రూ. 500 డిపాజి ట్ చేయాలి. లేదంటే ఖాతా ఆగిపోతుంది. ఈ సమయంలో లోన్, విత్‌ డ్రా సౌకర్యాలు అందుబా టులో ఉండవు. మీరు మెచ్యూరిటీకి ముందు ఆగిపోయిన ఖాతాను పునరుద్ధరించవ చ్చు. ఖాతా డిఫాల్ట్ అయితే ప్రతి సంవత్సరం రూ.50 రుసుము వసూలు చేస్తారు. డిఫాల్ట్ రుసుము కాకుండా డిపాజిటర్ ప్రతి సంవత్సరం కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. మినిమమ్‌ బ్యాలెన్స్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన

SSY పథకం నిబంధనల ప్రకారం ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఖాతా డిఫాల్ట్ గా పరిగణిస్తారు. పథకం నియమాలు మెచ్యూరిటీకి ముందు డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించడానికి అనుమతిస్తాయి. ఖాతాను పునరుద్ధ రించడానికి ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ.50 చెల్లించాలి.

కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1B) కింద అదనంగా రూ. 50,000 పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేయడానికి NPS ఖాతాను ఓపెన్‌ చేస్తారు. ఎన్‌పీఎస్ నిబంధనల ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏ వ్యక్తి అయినా కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories