పులి లేదా పిల్లి కళ్ళు చీకట్లో...

పులి లేదా పిల్లి కళ్ళు చీకట్లో...
x
Highlights

రాత్రి వేళల్లో వెలుతురు పడితే పులి లేదా పిల్లి కళ్ళు మెరుస్తాయెందుకో మీకు తెలుసా! పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో టాపిటం ల్యూసిడం అనే...

రాత్రి వేళల్లో వెలుతురు పడితే పులి లేదా పిల్లి కళ్ళు మెరుస్తాయెందుకో మీకు తెలుసా! పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో టాపిటం ల్యూసిడం అనే ప్రత్యేకమైన సన్నని పొర ఉంటుంది. ఈ పొరకు కాంతిని పరావర్తనం చేసే భౌతిక ధర్మం ఉంది. కొంతమేరకు పారదర్శకంగా ఉండే ఈ పొర కుంభాకారదర్పణం ఆకారంలో ఉంటుంది. కుంభాకార దర్పణంపై కాంతి కిరణాలు పడినప్పుడూ అవి పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. ఆ కిరణాల వల్లనే మనకు ఆయా జంతువుల కళ్ళూ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ పొర వలనే ఆ జంతువులు చీకట్లో కూడా పరిసరాలను చూడగలుగుతాయి. రాత్రివేళ బస్సు లో వెళుతున్నప్పుడు ఆ బస్సు లైట్ కాంతిలో జంతువుల కళ్ళు విభిన్న రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయి. పిల్లి కళ్ళు పచ్చగా , పశువుల కళ్ళు ఎర్రగా మెరవడం గమనించే ఉంటారు. ఇదంతా ఆయా జీవుల కంటి నిర్మాణం లో నున్న తేడాలు, కంటి లోపల కాంతిని గ్రహించే రెటీనాలో ఉండే స్పటికపు పొర కాంతిని ప్రతిఫలించే లక్షణము వలన , రెటీనాకు సరఫరా అయ్యే రక్తం ఈ స్పిటిక నిర్మాణములో వున్న తేడాలను బట్టి ఒక్కొక్క జీవి కళ్ళు ఒక్కొక్క రంగును బయటకు ప్రతిబింబిస్తయట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories