జపం..జపం.. జపం! కొంగ జపం!

జపం..జపం.. జపం! కొంగ జపం!
x
Highlights

ఒంటి కాలుమీద కొంగ ఎందుకు నిలబడుతుందో మీకు తెలుసా! ఒంటి కాలుమీద నిలబడిన కొంగను చూసి చాలామంది జపం చేస్తుందని అనుకుంటారు. కాని అది ఒక రకమైన రక్షణనట....

ఒంటి కాలుమీద కొంగ ఎందుకు నిలబడుతుందో మీకు తెలుసా! ఒంటి కాలుమీద నిలబడిన కొంగను చూసి చాలామంది జపం చేస్తుందని అనుకుంటారు. కాని అది ఒక రకమైన రక్షణనట. చల్లని నీళ్ళలో నిలబడినపుడు ఆ చల్లదనం నుండి రక్షణ కోసం కాళ్ళకు అధిక రక్తసరఫరా చేయాల్సి వస్తుంది. అది గుండెమీద ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి ఒక కాలుమీద నిలబడితే ఆ ఒత్తిడి సగం తగ్గుతుందట.ఒంటికాలు మీద నిలబడితే ఆ సన్నటికాలు గడ్డిలో కలసిపోయి శత్రుజీవులకు కనిపించదు. అది కూడా ఓ రక్షణ మార్గమే. కాళ్ళు తప్ప కొంగ శరీరము నిండా వెంటుకలు , ఈకలు తో నిండి ఉండి శరీర ఉష్ణోగ్రతను హెచ్చు తగ్గులు కాకుండా కాపాడు కుంటుంది. ఒంటి కాళు తో నిలబడి శరీర ఉష్ణోగ్రత పోకుండా 50% వరకూ నియంత్రించగలుగుతుంది . ఇదీ కొంగ జపం లోని అసలు రహస్యమట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories