బెర్ముడా ట్రయాంగిల్‌లో దాగివున్న రహస్యం

బెర్ముడా ట్రయాంగిల్‌లో దాగివున్న రహస్యం
x
Highlights

మీరు బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోతాయని వినేవుంటారు... అయితే అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా! అయితే ఈ బెర్ముడా...

మీరు బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోతాయని వినేవుంటారు... అయితే అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా! అయితే ఈ బెర్ముడా అనే ప్రాంతం పశ్చిమ అట్లాంటిక్‌ సముద్రంలో బెర్ముడా ద్వీపాలు, దక్షిణ ఫ్లోరిడా ప్యూర్టోరికాల మధ్య త్రిభుజాకారంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు, ఆకాశంలోని విమానాలు కొన్ని హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. ఇలా జరగడానికిగల కారణాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బెర్ముడా ప్రాంతపు సముద్ర లోతుల్లో మీధేన్‌ హైడ్రేట్‌ నిక్షేపాలున్నాయి. ఈ రసాయనిక పదార్థం వెలువరించే వాయువు మంచు స్ఫటికాల రూపంలోకి మారుతుంది. భూకంపాల వల్ల ఈ నిక్షేపాలకు నష్టం వాటిల్లినపుడు ఈ వాయువు పెద్ద బుడగల రూపంలో సముద్రపు నీటి ఉపరితలం చేరుకోవడంతో అక్కడి నీటి సాంద్రత తటాలున ఒక నాటకీయ రూపంలో తగ్గిపోవడంతో అక్కడికి చేరుకున్న నౌకలు నీటిపై తేలియాడే ప్లవన శక్తి ని కోల్పోయి మునిగిపోతాయి. మరో సిద్ధాంతం, మిగతా ప్రాంతాల్లోలా కాకుండా అక్కడ ఉండే విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలు ఉహించని రీతిలో తటాలున మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలోకి ప్రవేశించే యంత్ర భాగాలు పనిచేయకపోవడంతో అవి ప్రమాదానికి గురవుతాయట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories