చల్లగా బతుకు బిడ్డా...అంటూ చేతితో!

Highlights

కొద్దిమంది పెద్దవారు ప్రేమతో ఒక వక్తి తలదగ్గర తమ చేతులతో తెచ్చి, తమ చేతి వెళ్ళు విరిచి...ఆ శబ్డంకు ఆనందిస్తారు.. అయితే మీకు మన చేతి వేళ్లు విరిచినపుడు...

కొద్దిమంది పెద్దవారు ప్రేమతో ఒక వక్తి తలదగ్గర తమ చేతులతో తెచ్చి, తమ చేతి వెళ్ళు విరిచి...ఆ శబ్డంకు ఆనందిస్తారు.. అయితే మీకు మన చేతి వేళ్లు విరిచినపుడు శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా! మన చేతి వేళ్లలో ఎన్నో కీళ్ల తో కూడిన ఎముకలుంటాయి. జీవనిర్మాణ శాస్త్రం ప్రకారం వీటిని జారుడు కీళ్లు అంటాము.నిజానికి ఐదువేళ్ల ఎముకలు ఈ కీళ్ల సాయంతో విడివిడి గొలుసుల లాగా ఉంటాయి. వేళ్లు కదిలేటప్పుడు కీళ్ల దగ్గరే ఎముకలు అటూ ఇటూ కదులుతాయి. కదిలే యంత్ర భాగాల వద్ద ఘర్షణను నివారించడానికి ఎలాగైతే లుబ్రికంట్స్ వాడతామో, అలాగే మన వేళ్ల ఎముకులు కదిలే కీళ్ల దగ్గర ఒక రకమైన చిక్కని ద్రవం ఉంటుంది. కదలికల కారణంగా జీవన ప్రక్రియల్లో భాగంగా ఇందులో అప్పుడప్పుడు అతి చిన్న పరిమాణంలో గాలి బుడగలు ఏర్పడతాయి. మనం వేళ్లను మిటకరించినప్పుడు ఈ గాలి బుడగలు పగిలి ఆ ద్రవంలో చెదిరిపోతాయి. అప్పుడే మనకు వినపడే ఆ శబ్దం ఏర్పడుతుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories