CNG Bike: ప్రపంచంలోని మొట్టమొదటి CNG బైక్.. జూన్ 18న భారత మార్కెట్‌లోకి ఎంట్రీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

The Worlds First CNG Bike Will Be Launched Bajaj Auto On June 18
x

CNG Bike: ప్రపంచంలోని మొట్టమొదటి CNG బైక్.. జూన్ 18న భారత మార్కెట్‌లోకి ఎంట్రీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Highlights

Worlds First CNG Bike: బజాజ్ ఆటో CNG ఇంధనంతో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి బైక్‌ను 18 జూన్ 2024న విడుదల చేయబోతోంది.

Worlds First CNG Bike: బజాజ్ ఆటో CNG ఇంధనంతో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి బైక్‌ను 18 జూన్ 2024న విడుదల చేయబోతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన బైక్ పల్సర్ 400 ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

బజాజ్ మాట్లాడుతూ, 'ప్రపంచంలో మొట్టమొదటి CNG-శక్తితో పనిచేసే మోటార్‌సైకిల్ వచ్చే నెలలో రాబోతోంది. పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు సగం ఉంటుంది. ఇది అద్భుతమైన ఆవిష్కరణ' అంటూ చెప్పుకొచ్చారు.

పేరు Bruiser 125 CNG కావచ్చు..

పెరుగుతున్న ఇంధన ధరల మధ్య, బజాజ్ ఈ రాబోయే CNG మోడల్‌తో పెరుగుతున్న రన్నింగ్ ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ బైక్‌ను వివిధ దశల్లో విడుదల చేయనున్నారు. ఇది మొదట మహారాష్ట్రలో, తరువాత CNG స్టేషన్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ప్రారంభించబడుతుంది.

మీడియా నివేదికల ప్రకారం, ఈ CNG రన్ బైక్ పేరు Bruiser 125 CNG కావచ్చు. అదే సమయంలో, బజాజ్ మాట్లాడుతూ, 'మేం CNG బైక్‌ల పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తాం, ఇందులో 100CC, 125CC, 150-160CC బైక్‌లు ఉంటాయి' అని తెలిపారు.

CNG బైక్ తక్కువ కాలుష్యం..

FY25 మొదటి త్రైమాసికంలో కంపెనీ CNG బైక్‌ను విడుదల చేయనున్నట్లు బజాజ్ ఆటో MD గత నెలలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంధన ధరలను సగానికి తగ్గించాలని ఆయన అన్నారు.

కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి, ప్రోటోటైప్‌ను పరీక్షించినప్పుడు, కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలలో 50% తగ్గింపు, కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉద్గారాలలో 75% తగ్గింపు, నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలలో 90% తగ్గింపు ఉందని రాజీవ్ చెప్పారు. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే తగ్గింపు ఉంటుంది. అంటే CNG బైక్ నుంచి తక్కువ కాలుష్యం ఉంటుంది.

రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, 'ఈ మోటార్‌సైకిల్ పర్యావరణానికి గొప్పది. అయితే 40 ఏళ్ల క్రితం రిహో హోండా చేసినట్లే చేస్తామని హామీ ఇస్తున్నాం. అప్పుడు అది సమర్థవంతంగా ఇంధన ధరను 50-65% తగ్గించింది లేదా మైలేజీని రెట్టింపు చేసింది' అని తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories