Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి...!

Horoscope Today in Telugu 9th May 2024
x

Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి...! 

Highlights

Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. లిస్టులో మీరున్నారా..!

(09-05-2024, గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, శుక్ల పక్షం,

తిధి : పాడ్యమి ఉదయం గం.6.21 ని.ల వరకు, ఆ తర్వాత విదియ

నక్షత్రం: కృత్తిక ఉదయం గం.11.55 ని.ల వరకు., ఆ తర్వాత రోహిణి

అమృతఘడియలు: ఉదయం గం. 9.41 ని.ల నుంచి గం.11.11 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక మే 10వ తేదీ తె.వా.గం.3.10 ని.ల నుంచి గం.4.41 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.04 ని.ల నుంచి గం.10.55 ని.ల వరకు., మళ్లీ మధ్యాహ్నం గం. 3.13 ని.ల నుంచి సాయంత్రం గం.4.05 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.49 నిల. నుంచి గం.3.26 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.46 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.39 ని.లకు


మేషం : తెలివితేటలతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.


వృషభం : మానసిక ప్రశాంతత ఉంటుంది. చేపట్టిన పనులు సఫలం అవుతాయి. మిత్రులు తోడుగా ఉంటారు. ఆత్మీయులను కలుస్తారు. కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.


మిథునం : బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకీ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. భూమి సంబంధ వ్యవహారాలు అనుకూలించవు. విద్యార్థుల కష్టానికి గుర్తింపు ఉండదు. బంధువుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.


కర్కాటకం : పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. నిరాశ చెందక, బద్ధకాన్ని వీడి పనిచేయండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు పెరుగుతాయి. వాత సంబంధ చికాకు వస్తుంది. వృథాఖర్చులు పెరుగుతాయి.


సింహం : కార్యజయం, ధనలాభం ఉన్నాయి. నూతన వస్తుప్రాప్తీ గోచరిస్తోంది. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రుల తోడ్పాటు ధైర్యాన్నిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


కన్య : యోగదాయకంగా ఉంది. అభీష్టం నెరవేరుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. కొత్తవారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ బంధాలు దృఢమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.


తుల : ఆచితూచి వ్యవహరించండి. కీలక సమయంలో మిత్రులు తోడుగా నిలుస్తారు. అనవసరపు అపోహలు తగాదాలకు కారణమవుతాయి. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని కార్యాలు చేయాల్సి వస్తుంది.


వృశ్చికం : కార్యాలు జయప్రదం అవుతాయి. అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకుంటారు. భవిష్యత్తుకు తగిన ప్రణాళికలు వేస్తారు. ధర్మకార్యాల్లో పాల్గొంటారు. దూరప్రాంతానికి వెళ్లాల్సిరావచ్చు. త్వరగా అలసిపోతారు.


ధనుస్సు : ఇష్ట కార్యం అనుకూలంగా సాగుతుంది. బంధు, మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. శత్రువులపై పైచేయిని సాధిస్తారు. చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోండి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది.


మకరం : డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఇతరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూర్చుకుంటారు. సంతాన వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు.


కుంభం : ఖర్చులు తగ్గించుకోండి. బంధువులతో వ్యవహారాల్లో మాట తూలకండి. ఆత్మీయుల ఆనారోగ్యం కలవర పెడుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలకు అనుకూలం. ప్రయాణాలు లాభించవు. బద్ధకాన్ని వదిలేయాలి.


మీనం : శుభప్రదమైన రోజు. చేపట్టిన పని విజయవంతం అవుతుంది. సమాజంలో గౌరవాన్ని పెంచే కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. కీలక తరుణంలో అదృష్టం తోడవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories