Astro News: జ్యోతిష్యం ప్రకారం.. జాతకంలో శని, చంద్రుడు ఉంటే వారి స్వభావం ఇలా ఉంటుంది..!

According To Astrology If There Is Saturn And Moon In The Horoscope Then Their Nature Will Be Like This
x

Astro News: జ్యోతిష్యం ప్రకారం.. జాతకంలో శని, చంద్రుడు ఉంటే వారి స్వభావం ఇలా ఉంటుంది..!

Highlights

Astro News: జ్యోతిష్యం ప్రకారం ఈ భూమిపై పుట్టిన వ్యక్తులు జాతకం ప్రకారం కొన్ని లక్షణాల ను కలిగి ఉంటారు.

Astro News: జ్యోతిష్యం ప్రకారం ఈ భూమిపై పుట్టిన వ్యక్తులు జాతకం ప్రకారం కొన్ని లక్షణాల ను కలిగి ఉంటారు. ఇది వారి వారి జాతకాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. శని న్యాయ దేవుడు అతడు న్యాయాన్ని ఇష్టపడతాడు. చంద్రుడు మనస్సు కారకుడిగా పిలుస్తారు. నీటి రాశి అయిన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. నీరు ఎంత శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుందో ఈ రాశి వారు కూడా అలాగే ఉంటారు. కానీ చంద్రుడు ఇతర గ్రహాల సహవాసంలోకి వచ్చినప్పుడు నీరు ఇతర ద్రవాలతో కలిస్తే ఎలా మారుతుందో వారు అలాగే ప్రవర్తించడం మొదలుపెడుతారు.

కష్టపడి పనిచేస్తారు..

జాతకంలో చంద్రుడు, శని కలయిక వల్ల ఆ వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే శని దేవుడు కష్టపడి పని చేస్తాడు. అలాంటి వ్యక్తులనే ఇష్టపడతాడు. శని చంద్రుని కలయిక ఉన్న వ్యక్తులు తరచుగా న్యాయ రంగంలో పని చేస్తారు. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు కానీ కొన్నిసార్లు అవసరమైన దానికంటే ఎక్కువ సోమరితనం కలిగి ఉంటారు. జాతక రీత్యా శని, చంద్రుల కలయిక ఉన్నవారు పరిశుభ్రతను ఇష్టపడతారు. ఇతరులకు న్యాయం పాఠాలను నేర్పుతారు. ఇలాంటి వారికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం.

ఇంట్లోనైనా ఆఫీసులోనైనా మురికి కనపడితే తమ ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఎవరూ పట్టించుకోపోతే వారే స్వయంగా శుభ్రం చేసుకోవడం మొదలుపెడతారు. కష్టపడి పని చేస్తేనే విజయం లభిస్తుంది. ఒకవేళ ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే వారు ఇతర మతాలను అనుసరించే వారై ఉంటారు. శని, చంద్రుడు కలిగిన జాతక వ్యక్తులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఆలస్యమైనా విజయాన్ని అందుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories