ఆస్పత్రిలో చేరిన ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్

Submitted by lakshman on Wed, 09/13/2017 - 16:33

ఒక్క సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పేరు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో వినిపించింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని షాలిని భావించినట్టుంది. షోరూం ఓపెనింగ్స్‌తో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంది. నెల్లూరు జిల్లాలో ఓ మొబైల్ షోరూం ఓపెనింగ్‌కు వెళ్లింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి అప్పటికే సరిగా లేదు. అయినా వెళ్లి రిబ్బన్ కట్ చేసి వచ్చేయడమే కదా అనుకున్న షాలిని నెల్లూరులో తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర జ్వరం, తలనొప్పితో ఆమె నీరసించి పోయింది. ఆమెను అంబులెన్స్‌లో ఎక్కించి.. బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించి.. ఆమెను డిశ్చార్జ్ చేశారు. షాలిని ఆ తర్వాత తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కుతున్న మహానటిలో, తమిళంలో తెరకెక్కుతున్న 100%లవ్ రీమేక్‌లోనూ నటిస్తోంది. మహానటిలో శాలిని పాత్ర ఏంటనే విషయంపై స్పష్టత లేదు. 

English Title
arjun reddy actress shalini pandey becomes unconcious

MORE FROM AUTHOR

RELATED ARTICLES