కనీసం పది వేలు సంపాదించాలి: సీఎం

Submitted by lakshman on Wed, 09/13/2017 - 17:50

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘‘విజన్2022’’కు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మార్చి 2019 నాటికి ఏపీలోని ప్రతీ కుటుంబం నెలకు 12వేలకు పైగా ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. తద్వారా కుటుంబ వికాసం, సమాజ వికాసం అనే నినాదాలను నిజం చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలోని పేదవారిలో 34.69శాతం మంది 18 నుంచి 30 సంవత్సరాలోపు వారు ఉన్నారని, 35.48 శాతం మంది 31 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉన్నారని సీఎం తెలిపారు. వారికి సరైన విద్యఉద్యోగావకాశాలు కల్పిస్తే పేదరికాన్ని రూపుమాపొచ్చని సీఎం సూచించారు. స్వయం సహాయక సంఘ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తయారు చేయాలని, వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

English Title
In ap, every family should earn minimum 10000 PM

MORE FROM AUTHOR

RELATED ARTICLES