ఐటీ గ్రిడ్స్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

ఐటీ గ్రిడ్స్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
x
Highlights

రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన డేటా ప్రైవేటు కంపెనీలో ఉండటంపై.. ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు...

రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన డేటా ప్రైవేటు కంపెనీలో ఉండటంపై.. ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు సమర్పించారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ వద్ద ఉండటంపై తక్షణం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 3 కోట్ల మంది రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం సేవా మిత్ర యాప్‌ ద్వారా ఒక ప్రైవేట్‌ సంస్థకు ఏ విధంగా వెళ్లిందన్న దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా తన నియోజకవర్గం గురజాలలో 3,600 ఓట్లు నమోదు, 3,479 ఓట్లను తొలగించినట్లు కలెక్టర్‌ ఆఫీసులో ఉన్న డేటా చూపిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం డేటాలో మాత్రం కేవలం 300 ఓట్లు మాత్రమే తొలగించినట్లు చూపిస్తుండటంపై ఫిర్యాదు చేసినట్లు కాసు మహేష్ రెడ్డి చెప్పారు. న్నికల సంఘం జనవరి 11న విడుదల చేసిన ఓటర్ల జాబితా తరువాత జనవరి 11 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపు, చేర్పునకు 3,84,236 దరఖాస్తులు రావడంపై అనుమానాలు ఉన్నట్లు గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులురెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories