YS Jagan: నేడు ఇడుపులపాయ వెళ్లనున్న సీఎం జగన్..

YS Jagan: నేడు ఇడుపులపాయ వెళ్లనున్న సీఎం జగన్..
x

YS Jagan (file image)

Highlights

YS Jagan tour: దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో నివాళులు అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కడపకు వెళ్లనున్నారు.

YS Jagan | దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో నివాళులు అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కడపకు వెళ్లనున్నారు. అదేవిధంగా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో రూ. 1,863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా వేసింది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో రూ. 1,863.11 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ని 55,607 అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన 30,16,000 మందికి లబ్ధి చేకూరనుంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కారణంగా కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించినందున ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories