సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్

సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న డేటా చౌర్యం వ్యవహారంలో టీడీపీ...

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న డేటా చౌర్యం వ్యవహారంలో టీడీపీ అన్యాయంగా మాట్లాడుతోందని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఒక దొంగ, రాక్షసుడు, నేరస్థుడు పాలన సాగిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల డేటా ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎందుకు ఉంది, ఎన్నికల కమిషన్ వద్ద ఉండాల్సిన కలర్ ఫోటోలు ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ కంపెనీల వద్ద ఎందుకు ఉన్నాయి.. ఆ యజమానులు మీ దగ్గర ఎందుకు ఉన్నారు, వారితో మీకేం పని.. వారు తమవద్ద ప్రజల డేటా ఉంచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే ఏపీ పోలీసులను పంపించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. పైగా దీన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారని మండిపడ్డారు.

ఈ విషయంలో ఏపీ పోలీసులను చంద్రబాబునాయుడు రౌడీలుగా వాడుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర యాప్ లో పల్స్ సర్వే ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు.. దీనిని వైసీపీ ప్రశ్నిస్తుంటే టీడీపీ ఓట్లు వైసీపీ వాళ్ళు తీసేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. ఇది దొంగే దొంగతనం చేసి మిద్దె ఎక్కి దొంగ.. దొంగ అని అరవడం అని సీఎంపై వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఓట్లను తొలగించి.. దొంగ ఓట్లను చేరుస్తున్నారని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం డేటా చౌర్యం నేరం.. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం దారుణమన్నారు. చంద్రబాబునాయుడు నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలను కాల్చుకు తిన్నారని వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories