వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి : వైయస్ జగన్

వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి : వైయస్ జగన్
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ కాకినాడలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్బంగా వైసీపీ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.. వైయస్ఆర్ కాంగ్రెస్...

వైసీపీ అధినేత వైయస్ జగన్ కాకినాడలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్బంగా వైసీపీ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రేపటికి తొమ్మిదేళ్లు.. ఈ 9ఏళ్లు ఎన్నో కష్టాలను అనుభవించామని జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందించడమే నా లక్ష్యం. సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందాలి. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా. వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రజలు కోరుకునే ప్రజాపరిపాలన తీసుకొస్తాం. అవినీతిలేని పాలన తెస్తామని అన్నారు. అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేశాయి.

అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్పాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు విన్నాం... ఆ తర్వాత చేసిన మోసం చూశాం. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి అని అన్నారు జగన్. రాజధానిలో టెంపరరీ బిల్డింగ్‌లు తప్పా.. పర్మినెంట్ ఏదీ కన్పించదు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారు. చంద్రబాబు ఆయన బినామీలకే రాయితీలు, టెండర్లు ఇస్తున్నారు. ఎన్నికల వేళ సినిమాల పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామాలపై చర్చ జరగాలని జగన్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories