తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి కీలక సమావేశం

TTD Governing Council Meeting at Tirumala Annamayya Bhavan
x

తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి కీలక సమావేశం 

Highlights

TTD: 2024-2025 ఏడాదికి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక సమావేశం నిర్వహించనుంది. 2024-2025 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా... 2023-2024 ఏడాదికి గానూ.. 4 వేల 411 కోట్లు బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్ ఎంత ప్రవేశపెడతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు.. ఫిబ్రవరి 16న నిర్వహించనున్న రథసప్తమి ఏర్పాట్లపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే.. ఈ సమావేశంలోనే టీటీడీ విశ్రాంతి ఉద్యోగుల ఇళ్ల స్థలాల మంజూరుపై ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కాగా.. గత కొంత కాలంగా ఇళ్లు స్థలాల మంజూరు కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories