దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దాతృత్వం.. ప్రచారాన్ని ఆపి ఓ మహిళకు సర్జరీ చేసిన గొట్టిపాటి లక్ష్మి

TDP’s MLA Candidate Dr Lakshmi Wins Hearts
x

దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దాతృత్వం.. ప్రచారాన్ని ఆపి ఓ మహిళకు సర్జరీ చేసిన గొట్టిపాటి లక్ష్మి

Highlights

Dr Lakshmi: వైద్యం పేరుతో లక్షలు దోచుకునే వారిని నేటి రోజుల్లో చూస్తున్నాం.

Dr Lakshmi: వైద్యం పేరుతో లక్షలు దోచుకునే వారిని నేటి రోజుల్లో చూస్తున్నాం. పేషంట్ సీరియస్‌గా ఉన్నారని చెప్పి వారి బంధువులను ఆందోళనకు గురిచేస్తున్న ఘటనలు రోజు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం. ఇక గర్భిణీల విషయంలో చెప్పాల్సిన అవసరమే లేదు. వైద్య వృత్తికి ఇలాంటి వారు కలంకితులైతే... మచ్చుకు కొందరు తమ వృత్తికి న్యాయం చేస్తుంటారు. అలాంటి ఘటనే దర్శిలో చోటుచేసుకుంది.

కురిచేడు మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకట రమణ నిండు గర్భిణి. డెలివరీ కోసం దర్శినోని ఓ నిర్సింగ్ హోం డాక్టర్లను ఆమె కుటుంబసభ్యులు సంప్రదించారు. గర్భిణి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు బిడ్డ ఉమ్మనీరు తాగిందని... మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ బాధితులు.. డాక్టర్లతో తమ పేద పరిస్థితిని విన్నవించుకున్నారు. కడియాల ఆస్పత్రికి చెందిన డాక్టర్ లక్ష్మి దర్శిలోనే ఉన్నారని... ఆమెను సంప్రదించాలంటూ బాధిత కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు.

దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆపదలో ఉన్న గర్భిణిని కాపాడాలంటూ ఆమె కుటుంబసభ్యులు వేడుకోగా.... ప్రచారాన్ని మధ్యలోనే ఆపి పేద మహిళకు సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారు గొట్టిపాలి లక్ష్మి. సర్జరీ చేసి పండంటి బిడ్డకు ప్రాణం పోశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని గొట్టిపాలి లక్ష్మి తెలిపారు. ఇద్దరు సురక్షితంగా ఉండటంతో ఆ కుటుంబ సబ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories