టికెట్ పై అస్పష్టత.. మోదుగుల టెన్షన్

టికెట్ పై అస్పష్టత.. మోదుగుల టెన్షన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకుమార్...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకుమార్ తదితదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఆయన మంగళవారమే వైసీపీలో చేరిపోయారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన వైసీపీ నేతలతో చర్చించేందుకే హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు. టీడీపీలో చేరిన కొద్ది రోజులకే మోదుగుల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏదో తప్పదు అన్నట్లుగా పార్టీని అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టేసిన ఆయన ఇక టీడీపీలో ఇమడలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీలో.. మోదుగుల నరసారావుపేట ఎంపీ, సత్తెనపల్లి ఎమ్మెల్యే టిక్కెట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే నరసారావుపేట ఎంపీకి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉండగా సత్తెనపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గా కీలక నేత అంబటి రాంబాబు ఉన్నారు. వీరిద్దరిని కాదని మోదుగుల టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అందువల్లే మోదుగుల వైసీపీలో చేరేందుకు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories