TDP Leader Kollu Ravindra Arrest: మేకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు

TDP Leader Kollu Ravindra Arrest: మేకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు
x
Kollu Ravindra (File Photo)
Highlights

TDP leader kollu ravindra arrest: వైఎస్సార్సీపీ నాయకుడు మేకా బాస్కరరావు హత్య కేసులో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు.

TDP leader kollu ravindra arrest: వైఎస్సార్సీపీ నాయకుడు మేకా బాస్కరరావు హత్య కేసులో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు. ఆయన విశాఖ వెళుతుండగా మార్గమద్యలో తుని వద్ద పోలీసులు పట్టుకున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసుకు సంబంధించి ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు వెళ్తున్న రవీంద్రను మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు ఇచ్చిన సమాచారం అధారంగా రవీంద్రపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో మూడు బృందాలుగా గాలింపులు చేపట్టిన పోలీసులు అయన్ను ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అటు, ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీలను అరెస్టు చేశామని బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైనా కేసు నమోదు చేశామని అన్నారు. కాగా, మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య , చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories