Tirupati: స్మగ్లర్స్ అరెస్ట్.. 4 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Police Arrested Red Sandalwood Smugglers In Tirupati District
x

Tirupati: స్మగ్లర్స్ అరెస్ట్.. 4 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Highlights

Tirupati: ముందస్తు సమాచారంతో నిఘా పెట్టి ఆటకట్టించిన పోలీసులు

Tirupati: తిరుపతి జిల్లాలో భారీగా ఎర్రచందనం‌ దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు చోరీకి యత్నించారు. దుంగలను దొంగలించి లారీలో వేసుకొని వెళ్తుండగా సినీ ఫక్కిలో వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. లారీతో సహా నాలుగు టన్నుల పైబడి ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో తమిళనాడు రాష్ట్రంకు చేందిన 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు..

అదుపులోకి తీసుకున్న ఎర్రచందనం స్మగ్లర్స్ లో తమిళనాడు రాష్ట్రంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.. ఎర్రచందనం గోడౌన్లో కాపలదారులను బెదిరించి వారిని త్రాడుతో కట్టివేసి స్మగ్లర్స్ దొంగతనంకు పాల్పడ్డారు.. అయితే తమిళనాడు చేందిన ఎర్రచందనం స్మగ్లర్స్ ముఠా ప్రైవేటు ఎర్రచందనం గోడౌన్ లో దొంగతనం‌ చేయబోతున్నట్లు ముందస్తుగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు గత వారం రోజులుగా ఎర్రచందనం గోడౌన్ వద్ద పోలీసులతో కలిసి సంయుక్తంగా నిఘా ఉంచారు.‌.

సోమవారం తెల్లవారుఝామున ఎర్రచందనం దుంగలను దొంగలించేందుకు ప్రయత్నించిన తమిళనాడు స్మగ్లర్స్ పై ఒక్కసారిగా దాడులు నిర్వహించి స్మగ్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు.. ఎర్రచందనం గోడౌన్ లో ఎర్రచందనం దుంగల చోరీ వెనుక ఉన్న బడా స్మగ్లర్స్ ఎవరూ అనే విషయంపై టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.‌

Show Full Article
Print Article
Next Story
More Stories