ప్రభుత్వం దళితులపై దమనకాండకు పాల్పడుతోంది : చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం దళితులపై దమనకాండకు పాల్పడుతోంది : చంద్రబాబు నాయుడు
x

N. Chandrababu Naidu(file image)

Highlights

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. అమలాపురం పార్లమెంట్ నాయకులు, కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశంలో మాట్లాడారు.

Amaravati | టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. అమలాపురం పార్లమెంట్ నాయకులు, కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశంలో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఇప్పటికి వరకు 10పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు ఇప్పడు 11 వ సమీక్షగా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దళితులపై దమనకాండకు పాల్పడుతోందన్నారు. ఒక దళిత జడ్జిని అడుగడుగున అవమానానికి గురి చేస్తున్నారని చెప్పారు. "ఛలో మదనపల్లె" సందర్భంగా టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని, అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తుమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి సరికాదనీ, ప్రశ్నించే గొంతును నొక్కడం దుర్మార్గపు చర్య అని చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడలో దళిత యువకుడు అజయ్ ప్రాణాలు తీయడం అమానుషం అని చెప్పిన చంద్రబాబు.. కోవిడ్ నియంత్రణలోనూ జగన్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడ్ని చంపేశారు. ముఖ్యమంత్రి ఎక్కడా మాస్క్ పెట్టుకున్న దాఖలాలు లేవు. కోవిడ్ ను ఏ విధంగా నివారించాలి, ప్రజల ప్రాణాలు ఏవిధంగా కాపాడాలని ఎప్పుడూ ఆలోచించలేదు. పారాసిట్మాల్, బ్లీచింగ్ తో తగ్గుతుందని జగన్ హేళనగా మాట్లాడారు. దేశంలో కోవిడ్ విషయంలో నేడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. కోవిడ్ ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై వెబ్ సైట్ రూపొందిస్తున్నాం. తెలుగుదేశం బాధ్యతగా ప్రజల భాగస్వామ్యంతో కరోనా సోకకుండా ఉండేందుకు ఏం చేయాలి..? వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి..? వైరస్ సోకితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వీటన్నింటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో పొందుపరుస్తాం. అదే విధంగా స్పెషలిస్టులు, మేథావులు, డాక్టర్లు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంటారు. కరోనా..కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక వైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ ఆదాయం తగ్గటం, మానవ సంబంధాలు తెగిపోవడం వంటివి జరుగుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారిని ప్రొక్లైనర్లతో తీసుకువెలుతున్నారు. వైరస్ సోకిన ఎస్పీ బాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. తగ్గకపోవడం వలన మంచి గాయకుడిని పోగ్గొట్టుకున్నాం. వైరస్ ను నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వస్తాయి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. అంటూ చంద్రబాబు అమలాపురం నేతలకు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories