మురళీమోహన్ కు బదులు ఆమేనా?

మురళీమోహన్ కు బదులు ఆమేనా?
x
Highlights

వచ్చే ఎన్నికల్లో తాను గాని తన కుటుంబసభ్యులుగాని పోటీ చెయ్యరని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వెల్లడించారు. మురళీమోహన్‌ కోడలు రూపను పోటీకి దింపాలని...

వచ్చే ఎన్నికల్లో తాను గాని తన కుటుంబసభ్యులుగాని పోటీ చెయ్యరని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వెల్లడించారు. మురళీమోహన్‌ కోడలు రూపను పోటీకి దింపాలని టీడీపీ నేతలు కొందరు ఒత్తిడి చేస్తున్నా మురళీమోహన్ తిరస్కరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమను బలవంతం పెట్టొద్దని ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మురళి మోహన్ తేల్చి చెప్పారు. దాంతో మురళీమోహన్ కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో మహిళా నేత ముళ్ళపూడి రేణుక పేరును పరిశీలిస్తున్నారట.. రేణుక పాటు మరో ఇద్దరి పేరును కూడా పలిశీలిస్తున్నారట.. ఇందులో జాస్తి మూర్తి, శశి అధినేత బూరుగుపల్లి గోపాలకృష్ణ ఉన్నారు. ఎక్కువ శాతం రేణుక వైపే పార్టీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో మహిళలకు ఒకటి, రెండు ఎంపీ స్థానాలైనా కేటాయిస్తే అందులో రాజమహేంద్రవరం కూడా ఉండవచ్చనే అంచనా ఉంది. రేణుక అయితేనే గట్టి పోటీ ఇస్తారని చంద్రబాబు భావిస్తున్నారట.. ఉన్నత విద్యావంతురాలు, ప్రతి విషయాన్నీ చక్కగా ప్రజలకు వివరించి చెప్పగల సామర్ధ్యం రేణుకకు ఉంది. పైగా ఆమె వివాదాలకు దూరంగా ఉంటారన్న అభిప్రాయం ఉంది. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో భారీగానే ఎన్నికల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్ధికంగాను కూడా రేణుక పర్వాలేదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట.. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేయాలనీ టీడీపీ భావిస్తోందట.. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ రామ్ పేరు దాదాపు ఖరారైంది. ఇక జనసేన అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పోటీ చేయవచ్చనే ప్రచారం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories