ఆమంచి వైసీపీలో చేరిక.. గొట్టిపాటికి లైన్ క్లియర్!

ఆమంచి వైసీపీలో చేరిక.. గొట్టిపాటికి లైన్ క్లియర్!
x
Highlights

ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజురోజుకు మలుపులు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు ఊపందుకోవడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. అసంతృప్తిగా ఉన్న...

ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజురోజుకు మలుపులు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు ఊపందుకోవడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే పనిలో పడింది. ఇక ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడం ఖాయం కావడంతో చీరాలలో మాజీ ఎంపీ కరణం బలరాంను పోటీలోకి దింపేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అయితే కరణం బలరాం మాత్రం తన కొడుకు వెంకటేష్ కు అద్దంకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే చీరాలలో పోటీకి దిగుతానని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీనుంచి వచ్చిన గొట్టిపాటి రవి ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు.

ఈ క్రమంలో వెంకటేష్ కు ఎక్కడో ఒకచోట అడ్జెస్ట్ చేస్తానని చంద్రబాబు బలరాంకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈసారి పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ టికెట్ దగ్గుబాటి కుటుంబానికి దక్కనుంది. దీంతో దగ్గుబాటి కుటుంబానికి గట్టి పోటీ ఇవ్వాలంటే కరణం బలరాం కుటుంబం మాత్రమే ప్రత్యామ్నాయంగా చంద్రబాబుకు కనబడుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో పర్చూరు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కాకుండా కరణం వెంకటేష్ ఇస్తానని చంద్రబాబు చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో మూడు కీలక నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టామన్న అభిప్రాయం ఉంటుంది. అయితే చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత, పర్చూరులో ఏలూరి సాంబశివరావు టికెట్ వదులుకుంటారా అనే ప్రశ్న రాకమానదు. మరోవైపు అద్దంకి ని వదులుకోవడానికి కరణం బలరాం ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories