తిరుమలలో పెరిగిపోతున్న ట్రాఫిక్

Increasing Traffic in Tirumala
x

తిరుమలలో పెరిగిపోతున్న ట్రాఫిక్

Highlights

Tirumala: వాహనాల పొగతో కాలుష్య కోరల్లో తిరుమల క్షేత్రం

Tirumala: అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల క్షేత్రం, ప్రకృతి రామనియతకు, సహజశిలా రూపాలకు పుట్టినిల్లు పచ్చటి చెట్లతో.. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే తిరుమల, ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. కరోనా అనంతరం తిరుమలపై వాయు కాలుష్యం పెరిగిపోతుంది. దీనికి తోడు తిరుమలలో కార్లు, బైకులు పార్కింగ్ చేయటం మరింత కష్టతరంగా మారుతోంది. దీంతో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ సంకల్పించింది.

శ్రీనివాసుని దర్శించుకునేందుకు వేలాదిగా దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమలకు వచ్చిన భక్తుల గోవింద నామ స్మరణలతో ఏడు కొండలు మారుమోగుతాయి. భక్తులు నడక మార్గం, రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. నడక మార్గం కన్నా రోడ్డు మార్గం గుండా అధిక సంఖ్యలో భక్తులు సొంత వాహనాలల్లో, ప్రైవేట్ వాహనాల్లో, ఆర్టీసీ బస్సులలో కొండకు వస్తారు. ఘాట్ రోడ్డు ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల కన్నా ప్రైవేటు టాక్సీల వైపే భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు.

కరోనా ‎కంటె ముందు రోజులలో తక్కువ సంఖ్యల్లో వారి వారి వాహనాల్లో భక్తులు తిరుమలకు చేరుకునేవారు. సొంత వాహనాలో వచ్చే వారి సంఖ్య 15వందల లోపు ఉంటె..ఆర్టీసీ 750ట్రిప్పులు..ద్విచక్ర వాహనాలు వెయ్యి...టీటీడీ ఇతర సిబ్బంది వాహనాలు మరో 200 వందలు, ప్రైవేట్ టాక్సీలు మరో 2 వేలు పైచిలుకు వాహనాలు తిరుమల-తిరుపతి మధ్య నడిచేవి. రెండేళ్ల కరోనా సమయంలో పూర్తిగా పరిస్థితులు మారాయి. శ్రీవారి దర్శనాలు యధాతధంగా మళ్లీ అమలు చేయడంతో.. తిరుమలకు వచ్చే యాత్రికులు కరోనా భయంతో, సొంత వాహనాలతోనే తిరుమలకి వస్తున్నారు. ఇలా రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్యతో పాటుగా వాహనాల రాక పోకలు పెరుగుతుండడంతో వాతావరణ కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యంతో మసక బారుతోంది.

కాలం చెల్లిన పాత వాహనాల నుండి వెలుబడే పోగ కాలుష్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు రోజుకు 750 ట్రిపులు తిప్పుతుండగా..సొంత వాహనాలతో సుమారు 5వేల 200 భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. ఇక ట్యాక్సీలు 3వేలకు పైగానే తిరుమలకు చేరుకుంటున్నాయి. విధులకు వచ్చేవారు, స్థానికులు, భక్తులు రోజుకు టూ వీలర్స్ పై సగటున 16వందలు చేరుకుంటుండగా...ప్రభుత్వం, టీటీడీ వాహనాలు 100కు పైగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం వారాంతరాల్లో కోవిడ్ తర్వాత 12వేల నుండి 13వేల వాహనాలు వస్తుండటం గమనార్హం.

తిరుమలకు రోజుకు 13 వేల వాహనాలు చేరుకుంటున్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులను తీసివేయగా..దాదాపు 10 వేల వాహనాలు తిరుమలలోనే అనునిత్యం ఉంటుంన్నాయి. వాటన్నిటిని పార్కింగ్ చేయాలంటే.. కష్టతరంగా మారుతోంది. తిరుమలలో ఇప్పటికే చాలా చోట్ల పార్కింగ్ వసతులు ఏర్పాటు చేసారు. కానీ తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్యతో పోల్చుకుంటే వీటి సంఖ్య చాల తక్కువ. దీంతో చాల వాహనాలు రోడ్డుపైనే పెట్టాల్సి వస్తుంది.

బాలాజీ బస్టాండ్ మొదలుకొని గోగర్భం వరకు ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. ఎటు చుసిన వాహనాలు రోడ్డుపై దర్శమిస్తున్నాయి. అధికారులకు సైతం దారి లేకుండా పోతోంది. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు..కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే టీటీడీ అధికారులు మాత్రం రాబోయే బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో 5 నుంచి 6 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నమంటున్నారు. మరిన్ని పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా.. ట్రాఫిక్ జాం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories