Galla Aruna Kumari Resign : టీడీపీకి మరో షాక్!

Galla Aruna Kumari Resign : టీడీపీకి మరో షాక్!
x

galla aruna kumari 

Highlights

Galla Aruna Kumari Resign : టీడీపీకి మరో షాక్ తగిలింది.. టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టుగా ఆమె వెల్లడించారు

Galla Aruna Kumari Resign : టీడీపీకి మరో షాక్ తగిలింది.. టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టుగా ఆమె వెల్లడించారు. టీడీపీ కొత్త కమిటీలను నియమిస్తున్న సమయంలోనే ఆమె ఇలా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పనిచేస్తున్నారు.

ఇక గల్లా అరుణకుమారి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. నాలుగు సార్లు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. సుధీర్ఘకాలం ఆమె కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.. 2008లో వైద్య, విద్య, ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేయగా, 2009లో రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో భూగర్భ, గనుల శాఖా మంత్రిగా పనిచేశారు.

అయితే రాష్ట్ర విభజన తరవాత ఆమె కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు.. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో అదే చంద్రగిరి నుంచి పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. ఇక అదే సమయంలో ఆమె కుమారుడు గల్లా జయదేవ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి గెలిచారు.

ఇక అటు టీడీపీ నుంచి మరో సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 27న ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించింది టీడీపీ. ఈ క్రమంలో విశాఖ , అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులను ఎంపిక చేసేందుకు గాని, జిల్లా ఇంచార్జ్ లను నియమించేందుకు గాని చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. దాంతో ఆయన పార్టీని వీదనున్నారన్న చర్చ జరుగుతుంది.. అయితే గతంలో ఇలాంటి వార్తలు రాగా అయన ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories