ఉప్పాడ తీరంలో.. చేపల పంట!

Fishermen Harvest on the Uppada Coast of Kakinada District
x

ఉప్పాడ తీరంలో.. చేపల పంట!

Highlights

Kakinada: ఒకే బోటుకి చిక్కిన కోటి రూపాయల చేపలు

Kakinada: కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో సరైన చేపలు పడక ఇబ్బంది పడుతున్నమత్స్యకారుల బోట్లకు అధికంగా చేపలు చిక్కాయి. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సుమారు కోటి రూపాయలు విలువైన 12 టన్నుల కోనెం చేపలు.. మత్స్యకారుల వలలకు చిక్కాయి.

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన నీలపల్లి సత్తిరాజు సముద్రంలో చేపల వేటలకు వెళ్లారు. వీరి వలలకు సుమారు12 టన్నుల కోనెం చేపలు పడ్డాయి. కోనెం చేపలను అమినాబాద్‌ మినీ హార్బర్‌ వ్యాపారులకు విక్రయించగా ధర కిలో 900రూపాయల చొప్పున పలికింది. దీంతో మత్స్యకారులకు కోటి రూపాయలు ఆదాయం లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories