Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

First Warning Issued at Prakasam Barrage Pulichinthala
x

ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Prakasam Barrage: పులిచింతల 16వ గేటు విరిగిపోవడంతో దిగువకు నీటివిడుదల * పులిచింతల ప్రాజెక్టు దగ్గర 5,11,073 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

Prakasam Barrage: పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. పులిచింతల నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 4 లక్షల 34 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు అధికారులు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు ముంపు ముప్పులో ఉండగా.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక దిగువ ప్రాంతాల్లోని వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ కి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది.

ప్రాజెక్టు 16వ గేటు విరిగిపోవడంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన గేట్లపై ఒత్తిడి పడకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి ఇన్‌ఫ్లో లక్షా 84 వేల క్యూసెక్కులు ఉంటే ఐదు లక్షల 11 వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 22 టీఎంసీల నీరుండగా ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో గేటు అమరిక అధికారులకు సవాల్‌గా మారింది. వరద తగ్గి నీటిమట్టం తగ్గితే తప్ప స్టాప్‌ గేటును అమర్చే అవకాశాలు లేనట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories