Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

Erra Gangireddy Surrendered in CBI Court In Viveka Murder Case
x

Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

Highlights

Viveka Murder Case: నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి

Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించడంతో కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయాడు.

ఇప్పటికీ ఈ కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వివేకా కేసులో ఎర్రగంగిరెడ్డి పాత్ర కీలకంగా మారింది. వివేకా హత్యకు పథక రచన చేయడంతో పాటు దాన్ని అమలు చేసి, తర్వాత సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలోనూ ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ గంగిరెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories