శ్రీకాకుళం: మహిళా ఎస్ఐ చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు.. వైరల్ వీడియో

శ్రీకాకుళం: మహిళా ఎస్ఐ చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు.. వైరల్ వీడియో
x

మహిళా ఎస్ఐ శిరీష 

Highlights

*శ్రీకాకుళంలో మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై *అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకెళ్లిన కాశీబుగ్గ ఎస్సై శిరీష *స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన ఎస్సై శిరీష *మహిళా ఎస్సై శిరీషపై ప్రశంసల వర్షం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మహిళా ఎస్సైపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లిన మహిళా ఎస్సై.... ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. అడవి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుకున్న కాశిబుగ్గ ఎస్సై కొత్త శిరీష సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్థించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలో మీటర్ వరకు మోసుకు వెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక.. దాని నిర్వాహకులు చిన్ని కృష్ణతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు.. మహిళా ఎస్సై మంచి మనస్సును అభినందిస్తున్నారు.

మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సైపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లిన మహిళా ఎస్సై.... ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించింది. సాహో మహిళా అంటూ సిక్కొలు జిల్లా వాసులు మెచ్చెకుంటున్నారు... పోలీసు అంటే రక్షణ అని అర్ధం అన్ని వేళలా ఎప్పుడు ఏమి జరిగినా అండగా ఉంటామని ప్రమాణం చేసి ఈ ఉద్యోగానికి వస్తారు... ఆ ప్రమాణంను నిలుపుకుంది ఓ పోలీస్ మహిళ... ఆ మహిళ పోలీస్ పేరు శిరీష ప్రస్తుతం ఆమె కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ. పనిచేస్తుంది... పలాస మండలం అడవికొత్తూరు గ్రామంలో ఓ అనాధ చనిపోయిన విషయం తెలుసుకొన్న ఆమె హుటా హుటిన అక్కడకు చేరుకొన్నారు. ఎవరూ రాకపోతే ఆమె స్వయంగా ఆ శవాన్ని తన భుజాలపై మోసుకొని ఆ శవాన్ని దహన సంస్కరణల కోసం తీసుకొని వెళ్లడం ఆ శవాన్ని ఓ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా కార్యక్రమం నిర్వహించిన ఘటనను చూసిన జిల్లా వాసులు కొనియాడుతున్నారు. ఆమె మోసుకొస్తున్న విడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి...


Show Full Article
Print Article
Next Story
More Stories