Gajuwaka Conductor Jhansi: డ్యాన్సర్ గా అదరగొడుతున్న కండక్టర్ ఝాన్సీ

Dancer Gajuwaka Conductor Jhansi Real Life Struggles
x

Gajuwaka Conductor Jhansi: డ్యాన్సర్ గా అదరగొడుతున్న కండక్టర్ ఝాన్సీ

Highlights

Gajuwaka Conductor Jhansi: కండక్టర్ విధులు నిర్వర్తిస్తూ, టీవీ ఛానెల్‌లో డ్యాన్స్ షో

Gajuwaka Conductor Jhansi: ఆమె ఓ సాధారణ బస్ కండక్టర్. విధులు నిర్వహిస్తూ పిల్లల్నిచూసుకుంటూ జీవితం సాగిస్తుంది. నేను అట్టాంటి, ఇట్టాంటి ఆడదాన్ని కాదు బాబోయ్‌.. పల్సర్‌ బైక్‌ మీద రాను బాబోయ్‌ అనే పాటతో, ఇప్పుడు కుర్రకారుని హుషారెత్తిస్తోంది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లోని ఈ డ్యాన్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. కాని అంతటి పేరు వెనుక ఆమె కష్టం ఎంతో ఉంది. కండెక్టర్ ఝాన్సీపై hmtv స్పెషల్ స్టోరి.

గాజువాకకు చెందిన ఝాన్సీ ఆర్టీసీ డిపో కండక్టర్. తండ్రి బాధ్యత మరచి, భార్యాపిల్లల్ని వదిలేయడంతో తల్లికి అండగా నిలిచింది. ఓ వైపు చదువుకుంటూనే తనకి ఎంతో ఇష్టమైన డాన్స్‌ని నేర్చుకుంది. 2011లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఎంపికై, ఏడాది ట్రైనింగ్ తర్వాత గాజువాక డిపోలో విధుల్లో చేరింది. ఆ తర్వాత డాన్స్ పై తనకున్న ఇష్టంతో డ్యాన్స్‌ మాస్టర్ల దగ్గర చేరి వివిధ వేదికలపై ప్రదర్శన ఇచ్చింది. పెళ్లియి , ఇద్దరు పిల్లలున్నా.. డాన్స్ మీదున్న ఇష్టంతో, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ షోలు చేస్తోంది.

తాజాగా ఝాన్సీ ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన డాన్స్ షో.. తన మాస్ స్టెప్పులతో జడ్జీల మతి పోగొట్టింది. ఆ షో లో జడ్జీలు స్టేజ్‌పైకి వెళ్లి.. ఆమెతో కలిసి స్టెప్పులేసి మరి అభినందించారు. పలువురు డ్యాన్స్ మాస్టర్ల వద్ద శిక్షణ తీసుకుంది. రమేష్ మాస్టర్ ఆమెకు అవకాశం కల్పించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఝాన్సీ దాదాపు 15వందల వరకూ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. అక్కడి ప్రతిభతోనే టీవీషోల్లో అవకాశం దక్కింది. ఓ టీవీలో వచ్చిన డ్యాన్సింగ్ స్టార్ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 5 లక్షల నగదు ప్రోత్సాహం అందుకుంది. మరో ఛానల్‌లో రంగం2 తీన్మార్‌లో ఉత్తమ డ్యాన్సర్ అవార్డులు పొందింది. ఆర్టీసీ కార్యక్రమాల్లో డ్యాన్సర్‌గా వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది ఝాన్సీ.

నన్ను విమర్శించిన వాళ్లు నా వెనుకే ఆగిపోయారు. నేను ముందు ఉన్నాను అంటుంది ఝాన్సీ. ఓ వైపు చదువుకుంటూనే తనకి ఎంతో ఇష్టమైన డాన్స్‌ని నేర్చుకుంది. రోడ్డు మీద డాన్స్‌లేంటని ఛీదరించుకున్న వాళ్లే.. ఇప్పుడు వారెవ్వా ఏమైనా చేసిందా అని స్థాయికి ఎదిగింది. నిజానికి ఆమె మైక్ తీసుకుని 'నేను APSRTC గాజువాక డిపోలో కండక్టర్‌ని చెప్పేసరికి అంతా షాక్ అయిపోయారు. అయితే గాజువాక నుంచి భాగ్యనగరం చేరిన ఝాన్సీ జీవితంలో ఎన్నో ఆటు పోట్లను చూసింది.

ఝాన్సీ తనలాంటి వారికి పోత్సాహం ఇస్తూ వారిని సైతం ఎంకరేజ్ చేస్తోంది. ఝాన్సీ గంజి అన్నం తిని కడుపునింపుకున్న సందర్భాలు లేకపోలేదు. తన తమ్ముడ్ని ఎంబీఏ చదివించింది. ఆడపిల్ల రోడ్లు మీద డాన్స్ చేస్తుంటే చాలామంది మా అమ్మ తమ్ముడ్ని తిట్టారని, అప్పుడు తిట్టిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారని చెపుతుంది ఝాన్సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories