AP Budget 2021: ప్రాణం విలువ నాకు బాగా తెలుసు- సీఎం జగన్

CM Jagan Says He Knows the Value of Human Life in AP Budget Session 2021 Today
x

AP Budget 2021: ప్రాణం విలువ నాకు బాగా తెలుసు- సీఎం జగన్

Highlights

AP Budget 2021: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ గురువారం మాట్లాడుతూ... కోవిడ్‌ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోందన్నారు.

AP Budget 2021: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ గురువారం మాట్లాడుతూ... కోవిడ్‌ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోందన్నారు. ప్రాణం విలువ తనకు బాగా తెలుసని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు.. ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించానని తెలిపారు. రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశాం. ప్రతి 2 వేలమంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను ఏర్పాటు చేశాం అని తెలిపారు.

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి రావాలని, ఆరోగ్యశ్రీ నామమాత్రంగా ఉండకుండా, ప్రాణంపోసే పథకంలా ఉండాలని ఆకాంక్షించాం. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నాం. మేం అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1000 చికిత్సలకే అనుమతి ఉంది. మేం వచ్చాక 2,400 జబ్బులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 1180 అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేసి ప్రతి మండలానికి చేరవేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్కులు తీసుకువస్తున్నాం. 90 రకాల రుగ్మతలకు అక్కడ ఔషధాలు లభిస్తాయి అని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories