CM Jagan: మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan Reviewed the Women and Child Welfare Department
x

CM Jagan: మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Highlights

CM Jagan: పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి

CM Jagan: మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమంపై చర్చించారు. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన TMF.. స్కూళ్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన SMF తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ ఉండాలన్నారు. పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. అంగన్‌వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో కీలకంగా చర్చించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ తెలిపారు. లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ ఉండాలన్నారు. సెప్టెంబర్ 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు.. సీఎం జగన్‌కు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories