CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే.

CM Jagan Going To Idupulapaya Today
x

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

Highlights

CM Jagan: అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్‌

CM Jagan: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను నేడు సీఎం జగన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 12 గంటల30 నిమిషాలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గాన 12గంటల40 నిమిషాలకు వైఎస్సార్‌ ఘాట్‌ చేరుకుంటారు. తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ సందర్భంగా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. 1 గంటల45 నిమిషాల కడప విమానాశ్రయానికి బయల్దేరతారు. 2 గంటల15 నిమిషాలకు విమానంలో గన్నవరం వెళ్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories