జగన్ స్పందించకపోతే పార్టీకి రాజీనామా చేస్తా : వైసీపీ ఇంచార్జ్

జగన్ స్పందించకపోతే పార్టీకి రాజీనామా చేస్తా : వైసీపీ ఇంచార్జ్
x
Highlights

ఎన్నికల సమయంలో పార్టీలకు జంపింగులు కామన్. కొందరు సర్దుకుపోతారు.. మరికొందరు విభేదిస్తారు.. ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఇదే సమస్య ఎదురవుతోంది. చీరాల...

ఎన్నికల సమయంలో పార్టీలకు జంపింగులు కామన్. కొందరు సర్దుకుపోతారు.. మరికొందరు విభేదిస్తారు.. ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఇదే సమస్య ఎదురవుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను వైసీపీలో చేర్చుకుంటుండటంతో అక్కడ ఇంచార్జ్ గా కొనసాగుతున్న యడం బాలాజీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే యడం బాలాజీ అధినేత జగన్ పై తిరుగుబాటుకు సిద్దం అయ్యారు.ఆమంచిని పార్టీలో చేర్చుకోవద్దంటూ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చాలా రోజులుగా ఆమంచి ఆగడాలను ఎదుర్కొని.. పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు అతన్నిపార్టీలోకి చేర్చుకోవం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై జగన్ స్పందించకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని యడం బాలాజీ వెల్లడించారు. అయితే ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో జగన్ తరుపున పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగారు. బాలాజీతో చర్చలు జరుపుతున్నారు. అయితే అధినేత జగన్ తనకు టికెట్ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని బాలాజీ చెప్పినట్టు సమాచారం. దీంతో జగన్ వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేతలు బాలాజీకి సూచిస్తున్నారు. మరోవైపు బాలాజీని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరి బాలాజీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories