Prabhas: ప్రభాస్ ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయగలరా

Can Prabhas break that Belief |Telugu Movie News
x

ప్రభాస్ ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయగలరా

Highlights

Prabhas: ప్రభాస్ ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయగలరా

Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో క్లాస్ సినిమాలు ఓపెనింగ్ రోజున అంత మంచి కలెక్షన్లు చేయమని కమర్షియల్ లేదా మాస్ సినిమాలు మాత్రం మంచి ఓపెనింగ్ కలెక్షన్లు నమోదు చేసుకుంటానని ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది. అది చాలా వరకూ సినిమాల్లో నిజం కూడా అయింది ఉదాహరణకు ప్రభాస్ నటించిన సాహో సినిమా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అందుకే ఆ సినిమా ఓపెనింగ్ రోజున అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసుకుంది. పైగా "బాహుబలి" సినిమా తర్వాత విడుదలైన సినిమా కాబట్టి ముందు నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండేవి. కానీ "రాధే శ్యామ్" విషయంలో ఈ ఎడ్వాంటేజీ లు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియడం లేదు.

మొదటిగా చెప్పాలంటే రాధేశ్యామ్ ఒక క్లాస్ సినిమా. ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చూసనా కూడా ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ ప్రభాస్ మాస్ సినిమాలే ఎక్కువగా చేశారు. మరోవైపు డైరెక్టర్ రాధాకృష్ణ కెరీర్ లో కూడా పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు చేయలేదు. ఆయన మొదటి సినిమా "జిల్" బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా కొందరికి ఆవరేజ్ గానే అనిపించింది. పైగా ఈ సినిమా కి ఒక సాడ్ ఎండింగ్ ఉండబోతోంది అనే వార్త చాలా మంది అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. ఓపెనింగ్ కలెక్షన్లు ఎంత వచ్చినా అది కేవలం ప్రభాస్ ఇమేజ్ కే వస్తాయి. మరి కేవలం ప్రభాస్ స్టార్ డం మాత్రమే ఈ సినిమాకి ఎంత వరకు ఓపెనింగ్స్ ఇస్తాయి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories