ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ.. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసిన అధిష్టానం

BJP increased Aggression in AP
x

ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ..అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసిన అధిష్టానం 

Highlights

BJP: పురందేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ

BJP: ఏపీలో భారతీయ జనతాపార్టీ ఎన్నికల సమరశంఖరావంలో దూకుడు పెంచింది. ఎన్నికల పోరులో అభ్యర్థులను ఎంపీక ప్రక్రియను వేగవంతం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలో అభ్యర్థుల లిస్టును సిద్ధం చేస్తోంది. మరోవైపు ప్రజలకు అమోధయోగ్యమైన మ్యానిఫెస్టోను తయారు చేసే దిశగా అడుగులు వేస్తుంది. రెండు సార్లు సమావేశమైన మ్యానిఫెస్టో కమిటీ ఏఏ అంశాలు అందులో చేర్చాలనే అంశాలపై కసరత్తు చేస్తోంది. మ్యానిఫెస్టోల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ....వారం రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నది.

మోదీ మరొక్కసారి.. రాష్ట్రంలో ఒక్కసారి అనే నినాదంతో బీజేపీ నేతలు ప్రజా క్షేత్రంలోకి వెళ్లనుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు బీజేపీ నేతలు. దాదాపు 2 వేలకు పైగా ఆశావాహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అసెంబ్లీకి ముగ్గురు, పార్టమెంట్ కు ఇద్దరి చొప్పున పార్టీ అదిష్ఠానానికి పంపనున్నారు. రెండు రోజుల జరిగిన సమావేశంలో పొత్తుల విషయమైన నాయకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు నేతలు పొత్తు ఉండాలని...మరికొందరు ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అంటునే తుది నిర్ణయం మాత్రం అదిష్ఠానం పెద్దలు నిర్ణయమే అంటున్నారు.

మరోవైపు మ్యానిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర నాయకత్వం కుస్తీ పడుతుంది. మ్యానిఫెస్టో కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశమయ్యింది. ఎస్సీ, ఎస్టీ ,బీసీ వర్గాలతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలకు అగ్రభాగం మ్యానిఫెస్టో ఉంటుందని మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు దినకర్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి, సంక్షేమంలో ముందు భాగంలో ఉండే విధంగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.. ఉపాధి, యువతకు ఉద్యోగ కల్పిన వ్యవసాయం, చిన్న మధ్య తరగతి పరిశ్రామలను ప్రోత్సహించే విధంగా మ్యానిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.. ప్రజలకు ఆమోధయోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రేపటి నుంచి వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories